Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ జోగిపేట
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని అక్సానీ పల్లి పిఎసిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆందోల్ మండల పరిధిలోని డాకూర్ గ్రామంలో గ్రామ కోకో క్రీడాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి కోకో పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, క్రీడల్లో రాణించినట్లయితే ఏదైనా సాధించవచ్చు అన్నారు. చదువుతోపాటు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచినట్లయితే పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ పోటీలకు మండల పరిధిలోని 14 టీములు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.10 వేలు, రెండవ బహుమతి రూ.5వేలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాకూర్ మాజీ ఎంపిటిసి కలాలి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు శ్రీనివాస్ రెడ్డి, మోహన్, నిర్వాహకులు గణేష్, తరుణ్ రాజ్, గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అజరు, యువజన సంఘాల నాయకులు పద్మారావు, ప్రవీణ్, పీఈటీలు కనక ప్రసాద్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సదాశివాపేట: మండలంలోని నిజాంపూర్ లో అంబేద్కర్ యూత్ అధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌ను సోమవారం రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం చింత ప్రభాకర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపిటిసి మాధవరెడ్డి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ చాకలి రవి గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్ మాజీ సర్పంచ్ కరుణాకర్ విట్టల్ రెడ్డి సత్యనారాయణ కుమ్మరి నర్సింలు రాజశేఖర్ రెడ్డి రైతుబంధు అధ్యక్షులు అమరేందర్ రెడ్డి సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు ఆత్మకూరు నగేష్ సున్నిత సుధాకర్ సత్యనారాయణ సర్పంచులు శేఖర్ సలావుద్దీన్ నరేష్ గౌడ్ యేసయ్య మాజీ సర్పంచ్‌లు మాణిక్ సత్యం నాయకులు చోటు మియా గోపాల్ రెడ్డి రాందాస్ రమేష్ గ్రామ అంబేద్కర్ యువజన సభ్యులు పాల్గొన్నారు.