Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేటరూరల్
పుల్లూరుబండ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ మంత్రి నివాసంలో పుల్లూరు బండ జాతర గోడపత్రిక ఆవిష్కరించారు. అనం తరం వారు మాట్లాడుతూ పుల్లూరు బండ క్షేత్రం లో ఈ నెల 20 నుండి 24 వరకు 5 రోజుల పాటు జరిగే జాతర కు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం అయిన పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వందల వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని అన్నారు.లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ స్వయంభూ గా వెలిసాడని 8 వందల ఏండ్ల క్రితం కాకతీయుల కాలం లో ఇక్కడ దేవాలయం నిర్మించారని చెప్పారు.ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్య సందర్భంగా ఇక్కడ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని అన్నారు. జాతర కు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు
జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని
టిఎస్ ఆర్. టి. సి. అధికారులను ఆదేశించారు. బండపై ఉన్న గుండం లో భక్తులు స్నానాలు చేసే సందర్భంగా ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక రక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతరలో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ అధికారుల ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ సహకారం తో 31 లక్షల, టి టి డి నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు.. భక్తుల సౌకర్యం కోసం బండ పైకి వాహనాలు వెళ్లడం కోసం 30 లక్షల రూపాయల తో సి సి రోడ్డు నిర్మాణం చేశామని చెప్పారు. పుల్లూరు బండ పై 24 గంటలు మంచి నీటి సౌకర్యం కోసం 70 లక్షల రూపాయలతో 1 లక్ష 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను నిర్మింప చేశామని చెప్పారు..పుల్లూరు బండ స్టేజీ వద్ద 10 లక్షల రూపాయల తో దేవాలయ కమాన్ ను నిర్మింప చేశామని చెప్పారు,50 లక్షల రూపాయల తో దేవాలయం పక్కన కళ్యాణ మండపం భక్తులు,దాతల సహకారం తో 10 లక్షల రూపాయల తో దేవాలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణం చేశామన్నారు..15 లక్షల రూపాయల నిధులతో సుందరమైన సుడా పార్కు ను నిర్మింప చేశామని చెప్పారు.దేవాదాయశాఖ ద్వారా మరో 50 లక్షలు మంజూరు చేశామన్నారు. దేవాలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు కలకుంట్ల కృష్ణమాచారి, వంశపారంపర్య అర్చకులు కలకుంట్ల వెంకట నర్సింహ చార్యులు , కలకుంట్ల రంగాచార్యులు,కలకుంట్ల వీణా చారి, గోవర్ధనం నవీన్ కుమారాచార్యులు. సర్పంచ్ పల్లె నరేష్ గౌడ్, ఎంపిటిసి లతా వెంకట్, మాజీ సర్పంచ్ గడ్డం తిరుపతి రెడ్డి, దుర్గారెడ్డి, దేవాలయ కమిటీ డైరెక్టర్లు కోడూరి శ్రీనివాస్,మొలుగు లక్ష్మీ మల్లేశం,గొడుగు అంజయ్య,కొత్త గొల్ల శ్రీనివాస్, కుంచం బాలయ్య, పుల్లూరు గ్రామ అధ్యక్షుడు చింతకుంట మల్లేశం, బక్క శ్రీనివాస్, చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు.