Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సదాశివాపేట
సబ్ రిజిస్టార్ కార్యాల యాన్ని ప్రైవేటు భవనంలోకి మార్చాలనే ఆలోచనలను అధికా రులు విరమించుకోవాలని కోరు తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమ వారం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సదాశివపేట ఏరియా కార్యదర్శి వి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలన్నారు. ప్రైవేటు భవనంలోకి మార్చడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను అధికారులు తక్షణమే విరమించుకొని ప్రభుత్వ భవనంలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదాశివపేట పట్టణంలో అనేక ప్రభుత్వ భవనాలు ఖాళీగా నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఖాళీ ప్రభుత్వ భవనాలు ఉన్నాయన్నారు. ఈ భవనాలలోకి సబ్ రిజిస్టార్ ఆఫీస్‌ను మార్చాలని కోరారు. కార్యక్రమంలో సదాశివపేట సీపీఎం ఏరియా కమిటీ సభ్యులు రమేష్ గౌడ్, భూషణం యోసబ్, నాయకులు కుమార్, పాషా, మల్లేశం, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.