Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
జహీరాబాద్ పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చాలని కోరుతూ ఎంపీ బీబీపా టిల్‌కు విన్నవించామని మాజీ కౌ న్సిలర్లు రాములు నేత, జహం గీర్, మూర్తి, రాములు తెలిపారు. సోమవారం జహీరాబాద్ పార్ల మెంట్ సభ్యులు బీబీ పాటిల్‌కు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంక్రాంతి శుభాకాంక్షలు తెలివపారు. హైదరాబాదులోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిశారు. జహీరాబాద్ పట్టణంలో చాలామంది నిరుపేదలు సొంత ఇల్లు లేకుండా జీవిస్తున్నారని తెలిపారు. జహీరాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ స్థలాన్ని నిరుపేదలకు మంజూరు చేయించి ఆదుకోవాలని కోరారు. స్థలం ఉన్న వారికి రూ.3 లక్షల రుణం మంజూరు చేయించాలన్నారు. ప్రభుత్వం స్థలం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ వారికి సూచించారు. జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పి రాములు నేత మహమ్మద్ జహంగీర్ మహమ్మద్ అబ్దులా మోతిరామ్ రాథోడ్ పార్టీ నాయకులు మహమ్మద్ అక్రం పాల్గొన్నారు.