Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ జోగిపేట
'ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ వట్టినాగు లపల్లి-పఠాన్ చెరు-సంగా రెడ్డి-జోగిపేట మీదుగా మెదక్ రైల్వేలైన్ ఏర్పాటు. రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ కేంద్ర బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించే విధంగా ప్రత్యేక చొరవ చూపే విధంగా జిల్లా ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ కృషి చేయాలని జోగిపేట మాజీ మార్కెట్ చైర్మన్, అందోల్ నియోజకవర్గం రైల్వే సాధన సమితి అధ్యక్షులు గంగా జొగినాథ్, మాజీ మార్కెట్ చైర్మన్లు డిబి.నాగభూ షణం, యం.మల్లిఖార్జున్, మాజీ ఎంపీపీ .రామా గౌడ్, ఆర్యవైశ్య సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు జూ కంటి లక్ష్మణ్, నాయకులు చాపల వెంకటేశం, అల్లే గొపాల్ కోరారు. సోమవారం వారు జోగిపే టలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రైల్వే లైన్ కోసం 22 ఏళ్లుగా చేస్తున్న కషి నెరవేరేలా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు కషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో సాకారం అయ్యే గొప్ప అవకాశం ఉందన్నారు. జోగిపేట మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గతంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు జిల్లా మంత్రి హరీష్ రావు సహకారం తో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కలిసి రైల్వే లైన్ ఏర్పాటు చేయమని కోరగా ఆయన ఎన్ని కోట్లయినా కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు వారు గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న తరుణంలో..మరో మారు జిల్లా ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో సభ దష్టికి తీసుకువచ్చి నిధులు కేటాయించే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని గుర్తు చేశారు.