Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌కు మర్కుక్ ప్రజాప్రతినిధుల విన్నపం
నవతెలంగాణ-మర్కుక్
మర్కుక్ మండ లానికి రెగ్యులర్ తహశీ ల్దార్‌ను, సర్వేయర్‌ను నియమించా లని మ ర్కుక్ ఎంపీపీ తాండ పాండుగౌడ్, జెడ్పీ టీసీ యెంబరి మంగమ్మ రాం చంద్రం యాదవ్, వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి, బీఆర్ఎస్ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణాకర్ రెడ్డిలు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కోరారు. అంగడికిష్టాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన కలెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. సీఎం మండలంలో రెగ్యులర్ తహశీల్దారు లేకపోవడం, డిప్యూటీ తహశీల్దార్లకు అడిషనల్ పుల్ చార్జి ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయటం వలన తప్పిదాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పది రోజుల్లో రెగ్యులర్ తహశీల్దారు,సర్వేయర్‌ను నియమిస్తామని హామీనిచ్చారు. జిల్లాలో 23 మంది సర్వేయర్లు ఉండగా 16 మంది సెలవుల్లో ఉన్నారని,ప్రస్తుతం 07 మంది సర్వేయర్లు మాత్రమే విధులలో ఉన్నారన్నారు. త్వరలోనే కొత్త వారిని నియమిస్తామన్నారు.