Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
నవతెలంగాణ-మద్దూరు
మహిళా సంఘాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. మండల కేంద్రం లో జాతీయ గ్రామీణ అభివృద్ధి జీవనోపాధి మిషన్ ద్వారా మండల జాగృతి సమైక్యకు రూ.11, 60,000లతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ డోజర్ను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురువారం మండల సమైక్య సభ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలను, మండల సమైక్యను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. రైతులు, ప్రజలకు ఏవైనా పనులు ఉంటే మండల సమైక్య ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్ డోజర్ మార్కెట్ ధర కంటే తక్కువకు సేవలు అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమ మల్లేశం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేక సంతోష్ కుమార్, మంద యాదగిరి, రేబర్తి పిఎసిఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వంగా భాస్కర్ రెడ్డి, చొప్పరి వరలక్ష్మి సాగర్, సర్పంచులు ఎంపీటీసీలు ఏపీఎం బిక్షపతి, సీసీలు మహేందర్, ప్రేమలత, సిద్ది మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.