Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ అక్కన్నపేట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్
నవతెలంగాణ-అక్కన్నపేట
ఆదిలోనే అన్నదాతకు ఎదురు దెబ్బ తగులుతోందని, వాతావరణ పరిస్థితుల వల్ల గత పది రోజులుగా కాండం తొలుచు పురుగు, రెక్కల పురుగులు వరి పంటకు సోకడం వల్ల రైతులు నష్టపోతున్నారని సీపీఐ అక్కన్నపేట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ గురువారం తెలిపారు. ఈ వరి పొలాలని వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. దీనివల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు స్పందించి పొలాలను సందర్శించి రైతులకు, సూచనలు ఇవ్వాలని అన్నారు. తెగులు సోకిన పొలాలకు ఎక్కువ ఫర్టిలైజర్ వాడుతున్నారని అలా చేయడం ద్వారా మరింత నష్టం వాటిల్లుతుందన్నా,రు.