Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం గజ్వేల్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ దాసరి అమరావతి, జెడ్పీటీసీ పంగ మల్లేశం, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండే మధు, ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణ రెడ్డి ,రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి గ్రామపంచాయతీకి నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు మండలం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాలే పట్టుకొమ్మలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పల్లెల్లో పారిశుధ్య రంగంలో ఒక విప్లవ వచ్చిందన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కృష్ణ గౌడ్ సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ ఆనందం, భారస సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రమేష్ గౌడ్, అహ్మద్, నిజామోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.