Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్
ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. కంటి వెలుగు ప్రారంభంలో భాగంగా గురువారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో కార్యక్రమాన్ని ప్రారంభించి కంటి పరీక్షలు చేయించుకుని అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంటికి సంబంధించి సమస్యలు ఉంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కంటి వెలుగు ప్రారంభం తర్వాత సిద్దిపేట అర్బన్ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఓఎస్డి బాలరాజ్ ,ఎంపీపీ సవితా ప్రవీణ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఏపీవో శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ సంతోష్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్, ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాల్ రంగం, త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమంలో సుమారు 20 రోజుల పాటు అందరికి కంటి పరీక్షలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు పరీక్షల కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రారంభించారు. అనంతరం కంటి పరీక్షల నిర్వహణకు ఏర్పాటుచేసిన యంత్ర పరికరాలను, వసతులను పరిశీలించి ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ కడగండ్ల కవిత,సర్పంచ్ ద్యావనపల్లి మంజుల, ఎఎంసీ చైర్మన్ రాజయ్య, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ రాము, వైద్యాధికారి వినోద్ బాబ్జీ, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, బీఆర్ఎస్ మండలాద్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ దీటీ రాజు,అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-అక్కన్నపేట
అక్కన్నపేట గ్రామపంచాయతీ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పీటీసీ భూక్య మంగా శ్రీనివాస్, రామవరం గ్రామంలో వనపర్తి స్వప్న గురువారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, మండల ప్రత్యేక అధికారి సీతారాం, ఎంపీడీవో కొప్పుల సత్యపాల్ రెడ్డి, ఎంపీఓ కవి కుమార్, సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కందుల రామ్ రెడ్డి, వైద్యాధికారులు రమ్య, వినీత, వినోద్ రెడ్డి, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-దౌల్తాబాద్
మండల కేంద్రమైన దౌల్తాబాద్, ఇంద్రప్రియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంటివెలుగును ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎంపీపీ గంగాధరి సంధ్య ప్రారంభించారు. అనంతరం స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు వరం లాంటిదదన్నారు. ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక స్థానిక జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు సయ్యద్ రహీమోదీన్, సర్పంచ్ ముత్యంగారి యాదగిరి, సూరంపల్లి శ్యామల కుమార్, ఎంపీటీసీ ఆది వనిత, తాజా మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, వార్డు సభ్యులు, మా శెట్టి నరేష్ గుప్తా, దాసరికనకయ్య, ఆది సునీత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తాజా మాజీ సర్పంచి అది వేణుగోపాల్ ఎంపీడీవో రాజేష్ కుమార్, ఎంపీ ఓ గఫూర్ , డాక్టర్ భతుల నాగరాజు, ఫార్మసిస్ట్ ప్రభాకర్, సూపర్వైజర్ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి మెరుగు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-దుబ్బాక
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా దుబ్బాక మండల పరిధిలోని అప్పనపల్లి, ఆకారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలను ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్లు గురువారం ప్రారంభించారు. కంటి సమస్యల నివారణకు కంటి వెలుగు దోహదపడుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వారి వెంట ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి, సర్పంచ్లు దుంపటి లక్ష్మి పోశాద్రి, కాస నాగభూషణం, ఎంపీటీసీలు చిర్ర లావణ్య యాదగిరి, పోలబోయిన లక్ష్మి నారా గౌడ్, ఎంపీడీవో భాస్కర శర్మ, ఉప సర్పంచ్లు, పంచాయతి సెక్రటరీలు, మెడికల్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది, ఆశాలు, పలువురు పాల్గొన్నారు.
నవతెలంగాణ-దుబ్బాక
దుబ్బాక పరిధిలోని అక్బర్ పేట భూంపల్లి మండలం చిన్న నిజాంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ కడ్తాల రవీందర్ రెడ్డి, సర్పంచ్ షేర్ల రచన కైలాష్తో కలిసి గురువారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల్లో కంటి వెలుగు ఎంతో ప్రాముఖ్యమైనదన్నారు. ప్రతి ఒక్కరు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీ కోరారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దుబ్బాక పీఏసీఎస్ చైర్మన్ కైలాష్, దుబ్బాక ఏఎంసి చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ, ఎంపీటీసీ మంగళగిరి అంజమ్మ, ఎంపీడీవో భాస్కర శర్మ, ఎంపీఓ నరేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ, వైద్య సిబ్బంది ఆశాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నంగునూరు
అంధత్వ నివారనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నంగునూరు మండలం ఖానాపూర్, అంక్షాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు -2 వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండలంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కంటి వెలుగు వైద్య శిబిరాలను జిల్లా పంచాయతీరాజ్ అధికారి దేవకి దేవి, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్ అజీముద్దీన్ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, ఐలేని సత్తెవ్వ, ఎంపీడీవో వేణుగోపాల్, సోసైటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్, వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ నాయక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.