Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-మర్కుక్
కంటి వెలుగు కార్యక్రమం మహత్తర కార్యక్రమమని, పట్టణాలకు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకునే స్థోమత లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సువర్ణావకాశమని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎంపీపీ మర్కుక్ పాండుగౌడ్, జెడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మదాసు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి , బీఆర్ఎస్ మర్కుక్ మండలాద్యక్షులు మర్కుక్ కర్ణుని రెడ్డితో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కంటి పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు చేసిన ఐదు టేబుళ్లలో కంటి పరీక్షల తీరును పరిశీలించి కంటి పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. అవసరమైన వారికి రీడింగ్ గ్లాస్‌లను వెంటనే అందించాలన్నారు. నిబంధనల మేరకు నాణ్యత ఏర్పాట్లను పరిశీలించాలని క్వాలిటి కంట్రోల్ అబ్సర్వర్ డా. రాకేష్‌ను ఆదేశించారు. ఎఫ్డీసీ చైర్మెన్ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.కాశీనాథ్, కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు డాక్టర.శ్రీదేవి, వైద్యాధికారులు శ్రీనివాస్, శశిశ్రీ, ఆశాజ్యోతి, డివిజన్ అప్తామాలిస్ట్ తిరుపతి రెడ్డి, గ్రామ సర్పంచ్ దుద్దెడ లక్ష్మీ రాములు గౌడ్, ఎంపీటీసీ గోలి నరేందర్, తహశీల్దారు భాగ్యరేఖ, ఎంపీడీవో ప్రవీణ్, ఎంపీవో రాజలింగం, ఆర్ఐ బాలకృష్ణ, ఉపాద్యాయులు రామకృష్ణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నీలిమ, ఉపసర్పంచ్ కోండల్ రెడ్డి, గణేష్ పల్లి సర్పంచ్ మంజుల శీరాములు, బీఆర్ఎస్ గ్రామాద్యక్షులు ఎం.బాల్ రెడ్డి, నాయకులు అంజనేయులు, కుమ్మరి కనకయ్య, సుదర్శన్, రాముగౌడ్, నాగరాజు, వెంకటేష్, తిరుపతి, విజయ్, వార్డు సభ్యులు తదితరులున్నారు.