Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మనాభునిపల్లిలో నవతెలంగాణ 2023 క్యాలెండర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలికితీస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేయడంలో నవతెలంగాణ తెలుగు దినపత్రిక ముందంజలో ఉందని పద్మనాభుని పల్లి గ్రామ సర్పంచ్ కండ్లకొయ్య పర్శారాములు,మాజీ సర్పంచ్ ముక్కపల్లి శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ స్వామి చరణ్, దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రుద్రారం లింగం అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం 'నవతెలంగాణ 2023' క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అను నిత్యం ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా 'నవతెలంగాణ' పత్రిక పని చేస్తుందన్నారు. విభిన్న కథనాలను ప్రచురిస్తూ ప్రజల్లో తనకంటూ ఓ ముద్రణను ఈ పత్రిక వేసుకుందన్నారు. సరి కొత్త కోణంలో ప్రజా సమస్యలన్నీ అద్దంపట్టేలా చూపడానికి కృషి చేస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ భాస్కర్ రెడ్డి, వార్డ్ మెంబర్ విజయభాస్కర్, గ్రామ బీఆర్ఎస్ నాయకులు బొమ్మ స్వామి,కండ్లకొయ్య యాదగిరి, కండ్లకొయ్య శేఖర్, మండల బాలయ్య, గుండెల్లి రాజయ్య , వేముల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.