Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ములుగు
డ్రైవర్ అతివేగం అజాగ్రత్త వల్ల డివైడర్ రెడ్డి కొన్న కారు పల్టీలు కొట్టడంతో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఎస్సై రంగా కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూరు గ్రామానికి చెందిన ఎండీ మోజొద్దీన్(22) ఎల్ఈడి ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఆర్డర్ తీసుకోవడానికి కరీంనగర్ వెళ్లాడు. ఆదివారం కరీంనగర్ నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ఉదయం 7.30 గంటల సమయంలో ములుగు మండలం వంటిమామిడి గ్రామం దాటిన తరువాత రాజీవ్ రహదారి పక్కన గల చెట్లకు ఢకొీట్టింది. దీంతో కారు బోల్తా పడడంతో మోజొద్దీన్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ శ్రీధర్ అజాగ్రత్తతో ఈ ప్రమాదం సంభవించిందని మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.