Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దమాసాన్ పల్లి గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద బీజేపీ మండల కార్యవర్గం, శక్తిస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్ యెస్ఎన్ చారి, అసెంబ్లీ కొఆర్డినేటర్ విభీషణన్ రెడ్డిలు మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు జరగాల్సిన శక్తి కేంద్రాల స్థాయి స్ట్రీట్ కార్నర్ సమావేశాల గురించి చర్చిం చారు. భూత్ స్థాయి పార్టీ బలోపేతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేయాలన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కేటీఆర్ అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునదన్రావుపైన అనుచితవ్యాక్యలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు కేటీఆర్ చ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్నారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని ఆరోపించారు. హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఎన్నికైన తరువాత లక్ష బెడ్రూం లు పంచుతామని ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్ రూంలు పంచారని ప్రశ్నించారు. అదే విధంగా దళితులకు మూడు ఎకరాల భూమి,దళి తులకు దలితబందు ఏమైందన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రిగా రైతులకు 24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరు వులు ఇస్తానని హామీ ఇచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకపోటం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, గిరిజన బందు లాంటి వన్ని ఉచిత హామీలేనని ఎద్దేవా చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు స్వామి రెడ్డి, చంద్ర శేకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పరమెష్, బీజేవైఎం అధ్యక్షుడు కళ్యాణ్ దాస్, ఎస్సీ మోర్చ అద్యక్షుడు ఆంజనేయులు, ఎల్లారెడ్ పేట ఉపసర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, ఓబీసీ మోర్చ అధ్యక్షులు రాజశేఖర్, బూత్ అధ్యక్షులు కర్ణాకర్, రమేష్, సాగర్, స్వామి, శ్రీనివాస్, ఎల్లయ్య, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.