Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ఆదివా రం ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా సురేష్ గౌడ్ మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అవినీతి, భూ కబ్జాలతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అక్రమాలను బీజేెపీ ఒక్కటే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. తెలంగాణలో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేెపీ రాష్ట్ర నాయకులు పోతుగంటి రామదాసు, అంకుగారి శశిధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి లక్ష్మీ, అధికార ప్రతినిధి నర్ర మహేందర్ రెడ్డి, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి.కరీమో ద్దీన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు సిద్ధారెడ్డి, చేర్యాల, మద్దూరు మండలాల అధ్యక్షులు కాశెట్టి పాండు, నలసాని భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.