Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ కుమార్
నవతెలంగాణ-సిద్దిపేట
విద్య హక్కు చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 శాతం ఉచితంగా సీట్లు కేటాయించేటట్లు విద్యాశాఖ అధికారులు చూడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ కుమార్ కోరారు. పట్టణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య హక్కు చట్టాన్ని అన్ని పాఠశాలల్లో అమలయ్యే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.