Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నంగునూరు
నంగునూరు మండలంలోని మగ్ధుంపూర్ గ్రామంలో నంగునూరు బీజేపీ మండల అధ్యక్షులు బెదురు కుమారస్వామి ఆధ్వర్యంలో శక్తి కేంద్ర ఇంచార్జిల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా శక్తి కేంద్రాల వారిగా సమావేశం నిర్వహించామని కుమార స్వామి తెలిపారు. అదేవిధంగా నంగునూరు మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బండి సతీష్ కుమార్‌ను, మగ్ధుంపూర్ గ్రామ బూతు అధ్యక్షుడుగా కొలుపుల అశోక్‌ను నియమించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట అసెంబ్లీ కన్వీనర్ జలిగామ ఉపేందర్ రావు, జిల్లా కార్యదర్శి వాసర యాదమల్లు,నాయకులు ఉప్పల కృష్ణమాచారి,చిక్కుడు శ్రీనివాస్, బెండల రాజలింగం, బొల్లు తిరుపతి, గుర్రం వెంకటరెడ్డి,అచ్చిన రవి పాల్గొన్నారు.