Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ మద్దూరు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-గజ్వేల్
గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారని బయ్యారం గ్రామ సర్పంచ్ మద్దూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇంటిలో 'నవ తెలంగాణ'తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్డు సౌకర్యాలు లేవన్నారు. ఈ ఎనిమిది సంవత్సరాలలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల కృషితో నిధులు మంజూరైనట్లు ఆయన అన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.