Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గజ్వేల్
పేదలందరికీ 120 గజాల స్థలం, స్థలం ఉన్న వారికి ఆర్థికంగా ఐదు లక్షలు రూపాయలు సాయం చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సీఐటీ యూ ప్రజా సంఘాల ఐక్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఆర్థిక సహాయం అందించాలని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అన ుమతి ఇచ్చి మరల వెళ్లకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని ఆయన ఖండించారు. ఉదయం 6 గంటలకు ఇంటి వద్దకు వచ్చి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామికి వాతావ రణం ఉన్నదన్నారు. గజ్వేల్ పట్టణంలో సమగ్రంగా సర్వే నిర్వహించకుండా అనర్హులను జాబితాలో చేర్చి పేదలం దరికీ ఇల్లు లేకుండా చేయడం కోసం, కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. వెంటనే ఇండ్లు లేని పేద లందరిని సర్వే నిర్వహించి పట్టణంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అన్నారు. స్థలం ఉన్న వారికి ఆర్థిక సహా యం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి : పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొనకుండా ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, పేదల ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని గురువారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఏర్పాటు చేశార న్నారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులను సంగారెడ్డి, సదాశివపేట, జహీరా బాద్, నారాయణఖేడ్‌లో అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం సరికాదన్నారు. అరెస్టు చేసిన నాయక ులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ సాక్షిగా పేద లందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, స్థలమున్నవారికి మూడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన హామీల అమలు కోసం అడ ుగుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం సరైనది కాద న్నారు. వెంటనే అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ స్థలమున్నవారికి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాల ని.. ఇచ్చేదాకా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటం ఆగదన్నారు.
కొండపాక : ఇండ్లు,ఇండ్ల స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకొని ముంద స్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని సీఐటీయూ మండల కార్యదర్శి అమ్ముల బాల నరసయ్య అన్నారు. రాష్ట్రంలో నిర సన తెలియజేసే హక్కు లేకుండాచేస్తున్నారని మండి పడ ా్డరు. ప్రభుత్వమిచ్చిన హామీలే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహి స్తుంటే రాత్రికి రాత్రి వచ్చి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిం చారు. ఎంత ఆనచాలని చూస్తే అంత పోరాటాలు లేస్తాయన్నారు. ప్రభు త్వం ఎప్పటికైనా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వాలని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలముండి ఇల్లు నిర్మించుకుందాం అను కునే అర్హులకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.
నారాయణఖేడ్ : ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న ధర్నాలో పాల్గొనకుండా సీపీఐ(ఎం), సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) ఖేడ్ ఏరియా కన్వీనర్ చిరంజీవి ఖండించారు. అరెస్టు చేసిన నాయకు లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు శంకర్ విటల్ తదితరులు పాల్గొన్నారు.