Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండాపూర్
ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు, రేపు(10, 11 తేదీల్లో) హైదరాబాద్లో చేపట ్టనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కన్వీనర్ బాబురావు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం వీవోఏల మండల కమిటీ సమావేశాన్ని నిర్వ హించి.. ఐకేపీ ఏపీఎంకి వినతిపత్రం అందజేశారు. అనం తరం బాబురావు మాట్లాడుతూ.. వీవోఏల పట్ల రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. వారికి రూ.3,900 గౌరవ వేతనం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నదని ఆవే దన వ్యక్తం చేశారు. వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. శ్రీనిధి ఇన్సెంటివ్ గ్రామ సంఘంతో సంబంధం లేకుండా వీవోఏలకే చెల్లించా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి వీవో ఏల సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకో వాల న్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్ర మాల ను నిర్వహిస్తామన్నారు. కాగా ఈ మహాధర్నాలో మండల వీవోఏలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. వీవోఎల మండల అధ్యక్షులు సంజివులు, సహాయ కార్యద ర్శి ప్రవీణ్, ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, మండల కమిటీ సభ్యు లు, లక్ష్మి, అశ్విని, సునీత, కల్పన, శివాజీ తదితరులున్నారు.