Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజుకో గ్రామం చొప్పున నెలరోజుల పాటు సాగిన ఉత్సవాలు
- హాజరైన అదనపు కలెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పలువురు విదేశీయులు
- జీవవైవిద్య ఉత్తమ రైతులకు సన్మానం
- ఆకట్టుకున్న జానపద కళలు, పల్లె పాటలు
నవతెలంగాణ-ఝరాసంగం
చిరుధాన్యాల ప్రాముఖ్యత.. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించి.. సాగు చేసే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత 23 ఏండ్లుగా ప్రతీ సంక్రాంతి పండుగ సందర్భంగా పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు జరిగిన జాతర ఒక్కో రోజు.. ఒక్కో గ్రామంలో నిర్వహిస్తారు. అందులో భాగంగా ఈయేడు శనివారం డెక్కన్ డెవల ప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఝరాసంఘం మండలం లోని మచునూర్ గ్రామంలో గల 'పచ్చసాలె' ఆవరణంలో 23వ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముగింపు ఉత్సవాలకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డి.సత్యనా రాయణ రాజు దిశా కన్జ్యూమర్ మూమెంట్, డాక్టర్ అర్చన పట్నాయక్ ప్రొఫెసర్ ఐఐటి ఖరగపుర్, డాక్టర్ ఆర్ అఖిలేశ్వరి సీనియర్ జర్నలిస్ట్, షేక్ అన్వర్ అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్, డాక్టర్ సివి రత్నావతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో అదనపు పాలనా అధికారి వీరారెడ్డి మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న డీడీఎస్ వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ప్రస్తుత సంగారెడ్డి జిల్లాకు మంచి పేరు ఉందన్నారు. తణధాన్యాలు తినడం వల్ల రోగాలు దరి చేర వన్నారు. శక్తి లేని ఆహారం తినడంతో మనుషుల ఎదు గుదల తగ్గిపోతుందన్నారు. కాబట్టి వీటిని భవిష్యత్తు తరా లకు అందించడమే డీడీఎస్ లక్ష్యమన్నారు. ఇది ఒక సహకార ఉద్యమంలో కొనసాగి ముందుకు తీసుకె ళ్లాల న్నారు. వీటి వెనక కుటుంబ సహకారం ఎంతో ఉంద న్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ సి.వి రత్నావతి మాట్లాడుతూ.. జొన్న పంట పై గత 34 ఏండ్లుగా పరిశోధన కొనసాగి స్తున్నామన్నారు. జొన్నతో బీర్లు సైతం తయారు చేయ వచ్చ న్నారు. రాగి జావా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. చిరుధాన్యాలను ఇతర దేశాలకు ఎగమతి చేయాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జి-20 సమావేశాలలో చిరుధాన్యాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వాటిపై మాట్లాడతామన్నారు. ఆవాలపై జన్యు మార్పిడి జరగకుండా జరగకుండా దేశవ్యాప్తగా మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని.. ఈ విషయమై కలెక్టర్ కు సైతం వినత పత్రం అందజేస్తామని డాక్టర్ వి రుక్మిణి రావు అన్నా రు. అంతకుముందు జాతరకు సహకరించిన మహిళా సం ఘం సభ్యులకు ఘనంగా సన్మానించారు. డీడీఎస్ పౌండర్ పివి సతీష్, సర్పంంచ్ రాజు కుమార్, మాణిక్యం, నర్సింలు వివిద గ్రామాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు.