Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జోగిపేట
ప్రజలు, కక్షిదారులు తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జోగిపేట మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ధనలక్ష్మి అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమయం, డబ్బులు వృధా కాకుండా కేసులను త్వరగా పరిష్కరించుకో వాల న్నా రు. రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. రాజీ కుదు ర్చు కొని ఇరువు రు కలిసిమెలిసి ఉండాలని సూచిం చారు. ఈ లోక్ అదాల త్లో వివిధ రకాల 139 కేసులను పరిష్క రించి నట్లు తెలిపారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాస ిక్యూటర్ స్వాతి గౌడ్, ఏజి పి హరి నారాయణ వర్మ, బార్ అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నారాయణ రెడ్డి, విట్టల్ రెడ్డి, కృష్ణారెడ్డి, సంగమేశ్వర్, శ్రీకాంత్, లింగమయ్య, చం ద్రారెడ్డి, శివ ప్రసాద్, వెంకట కృష్ణ, మల్లేశం, ప్రేమ్ పాల్గొన్నారు.