Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రతీ గ్రామంలో సీసీరోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణానికి తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో నిధులు కేటాయిస్తోందనిన్నారు. జిన్నారం మండలం జంగం పేట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, నియోజ కవర్గ విధుల పత్రం ద్వారా మంజూరైన రూ.40 లక్షలతో చేపట్టిన పలు సీసీరోడ్లు, అంతర్గత మురికినీటి కాలువలు, నూతన సీసీ రోడ్ల నిర్మాణాలకు స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పటాన్చె రు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిదు ్దతున్నామన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర ్ఎస్ సీనియర్ నేత వెంకటేష్ గౌడ్, గుమ్మడిదల జెడ్పీటీసీ కుమార్ గౌడ్, సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్, షేక్ హుస్సేన్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.