Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోలోని ఆంటోనీ ఉమెన్స్ కళా శాలలో శుక్రవారం నిర్వహించిన టాస్క్ జాబ్ మేళాలో ఆచార్య డిగ్రీ కళాశాలకు చెందిన 25 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికైట్టు ఆచార్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింతల హరి కుమార్ తెలిపారు. స్థానిక కళాశాలలో, వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలకు ఎంప ికైన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థులు వివిధ కార్పొరేట్ రంగాలతో పాటు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారన్నారు. ప్రస్తుత సంవత్సరం కూడా 25 మంది విద్యార్థులు హెచ్వ న్హెచ్ఆర్ బజాజ్ అలియాంజ్ టెలి పర్ఫామెన్స్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. ఉద్యోగాలు సంపాదించిన సంస్థల్లో నిబ్దతతో విధులు నిర్వహించి జహీరాబాద్ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కళాశాల టాస్క్ నిర్వా హకులు ముత్త కుమార్, నరసిం హులు, కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యాపకులు రామచంద్రం, చందు, దత్తు, రమేష్, నిఖిత, లావణ్య, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.