Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సదాశివాపేట
శివనామస్మరణలోనే సంపూర్ణ సంతోషముంటుందని.. ప్రతీ ఒక్కరు దైవమార్గంలో నడుచుకోవాలని పిల్లోడి రాచన్న గురుస్వామి అన్నారు. శనివారం 12 జ్యోతిర్లింగాల మహా పడిపూజ శ్రీ సంగమేశ్వర మందిరం సన్నిధానం స్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామివారికి మహాభిషేకం, బిల్వార్చన, శివమాల ద్వారా స్వాముల ఆటపాటలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం 12మెట్ల పడిన వెలిగించి పాల్గొన్న స్వాములకు భక్తులం దరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా రా చన్న గురుస్వామి పూజారులు జి.మోహ న్రావు, నారాయణరావులు మాట్లాడారు. అనంతరం సన్నిధానం స్వాములు జ్యోతిర్ముడి కట్టుకొని ఊరేగింపుగా దుర్గామాతను దర్శించుకొని శ్రీశైల గిరికి బయలుదేరి వెళ్లారు. సన్నిధానం గురు స్వాములు సుధాకర్ గురుస్వామి, సంగమేశ్వర్ గురుస్వామి, శ్రీనివాస్ గురు స్వామి, రాజశేఖర్, గురుస్వామి రమేష్, గంగారం గురుస్వామి, రమేష్ గురు స్వామి, రవి గురుస్వామి, మల్లేశం గురుస్వామి, కౌన్సిలర్ శివకుమార్, ముద్ద నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు.