Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పుల్కల్
గ్రామాభివృద్ధే ధ్యేయంగా గ్రామంలో పనులు చేపడుతున్నామని బస్వాపూర్ సర్పంచ్ బేగరి సంగమ్మ విష్ణయ్య అన్నారు. గ్రామంలో శనివారం సీసీరోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు అవుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ హయంలో జరగలేని పనులు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగాయన్నారు. బస్వాపూర్ను మండలంలోనే కాకుండా జిల్లా స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మాచర్ల విజయ కుమార్, ఉపాధ్యక్షులు, విష్ణయ్య, గ్రామాధ్యక్షులు బర్మల రాజు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.