రాత్రి, ఆకాశం, చుక్కలు, చంద్రుడు, గాలి, నీరు వీటితో బాల్యం నిండిపోయేది. వీటితో పాటు నాయనమ్మ, అమ్మమ్మ, తాత, అత్త.. వీళ్ళు లేని బాల్యం వుండేది కాదు. రాత్రి ఆరుబయట వెల్లకిలా తాత పక్కన పడుకుని, ఆకాశంలో చుక్కల్ని కలిపి చిత్రాలు గీసుకుంటూ ఎప్పుడు నిద్రాదేవి ఒడిలోకి జారిపోయేవాళ్ళమో... అర్థరాత్రి గుడ్లగూబ చెట్టుమీద బుగులు