Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ దవాఖానల్లో పండ్ల పంపిణీ
- కేక్ కటింగ్, ఆలయంలో పూజలు
- కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
వనపర్తి : వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. వనపర్తి జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ 69వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. వనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. బీ అర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్‌లో కేక్ కట్ చేసి ఆకాశంలోకి బెలూన్లు వదిలారు. వనపర్తిలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ లో రైతులు, హమాలీలు,చాటకూలీల మధ్యలో ఉలువలు, పల్లీలు, ఉ ప్పుతో అలంకరించిన చిత్రపటం దగ్గర మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ లక్ష్మయ్య, గొర్ల కాపరుల సంఘంజిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, ఎండీ రహీం, మార్క్ ఫైడ్ డైరెక్టర్ విజరు, బీ అర్ ఎస్ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, యూత్ అధ్యక్షుడు గిరి, కౌన్సిలర్ లు పాకనాటి కృష్ణ, ఎల్ ఐ సి కృష్ణ, నందిమల్ల శ్యామ్, గులాం ఖాదర్, పెండెం నాగన్న, సమద్, బండారు కృష్ణ, డేనియల్, శివ శంకర్, సుబ్బు, పసుల బాలకిష్టి, చీర్ల శ్రీను, బాబు నాయక్ నందు, శివ గౌడ్ జీవీప్రశాంత్, సాయి లీలా, ప్రేమనాథ్ రెడ్డి జోయెబ్, ఇమ్రాన్, పాషా స్టార్ రహీం , బీఅర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆత్మకూర్‌లో..
ఆత్మకూరు పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 69వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయిబాబా గుడి దగ్గరకు వెళ్లి కేసీఆర్ సుఖసం తోషాలతో జీవించాలని సాయిబాబాను ప్రార్థించారు. అనంతరం అతిథి గృహం వద్ద కేక్ కట్ చేశారు. కార్యక్ర మంలో మునిసిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవికుమార్, వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, కమిషనర్ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ, పోషన్న ,మండల పరిషత్ అధ్యక్షులు బంగారు శ్రీనివాసులు ,ఉపాధ్యక్షులు కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యా దవ్, బీఆర్ఎస్ అధ్యక్ష,కార్యదర్శులు, సర్పంచులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
కొత్తకోటలో..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కానాయపల్లి, కని మెట్ట, అప్పరాల, కొత్తకోట పట్టణంలోని బుడగ జంగల కాల నీలో వేడుకలు నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్య క్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సి పల్ చైర్మన్ పొగాకు సుఖెషిని విశ్వేశ్వర్, ఎంపీపీ గుంత మౌనిక, ఉమ్మడి జిల్లాల డీసీబీఐ డైరెక్టర్, కొత్తకోట సింగిల్ విండో చైర్మన్ వంశీదర్ రెడ్డి, కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా మైనోద్దీన్, రామ్మోహన్‌రెడ్డి, పద్మ అయ్యన్న, చింతలపల్లి సంధ్యా రవీందర్ రెడ్డి, హౌటల్ రాములు యాదవ్, కో అప్షన్ సభ్యులు వసీం ఖాన్, తహెసీన్ వహీద్ అలీ, సింగిల్ విండో డైరెక్టర్ జేసీబీ భాస్కర్, మాజీ వార్డు సభ్యులు సుభాష్, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రావుల సురేంద్రనాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, రావుల గోపాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, వడ్డే రాములు, కుర్మయ్య, లక్ష్మీనా రాయణ, బుడగ జంగం గణేష్, శంకర్, వికాస్,బిఆర్ఎస్ జేసీబి అరుణ్, బీఆర్ఎస్ ఉద్యమ నేత నాగేష్ రెడ్డి, మహేష్, పట్టణ మైనారిటీప్రధానకార్యదర్శి ఎండీ షకీల్ పాల్గొన్నారు.
చిన్నంబావి మండలంలో..
మండలంలోని కొప్పునూరు గ్రామంలో బీఆర్ఎస్ అధ్యక్షులు డేగశేఖర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహి ంచిన టీిఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కేసీరెడ్డి వెంకటరమణమ్మ, కొప్పు నూరు సర్పంచు నంది కౌసల్య , ఎంపీటీసీ తగరం లక్ష్మి , ప్రజాప్రతి నిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీపనగండ్లలో..
బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి బీఆర్ఎస్ మం డల అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ క్షీరాభిషేకం చేశా రు . అనంతరం మిఠాయి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుక సందర్భంగా గర్భిణీలకు , బాలింతలకు డాక్టర్ వంశీకృష్ణ పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తుంకుంట సింగిల్ విండో చైర్మన్ రామన్ గౌడ్, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి , ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, సంపత్‌రావు పల్లి సర్పంచ్ రామేశ్వరరావు, నాయకులు ఎద్దుల సురేందర్ రెడ్డి, ఎస్ వెంకటయ్య , వేణుమాధవ్ రెడ్డి, మల్లయ్య, రజాక్, శేఖర,డాక్టర్లు రాజశేఖర్, శ్వేత, విజరు, కంప్యూటర్ ఆపరేటర్ రాఘవేందర్, ఏఎన్ఎం భారతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అమరచింతలో..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను అమరచింత పట్టణ కేంద్రంలో బస్టాండ్ కూడలీలో టీఆర్ఎస్ జండా వద్ద ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ నాగ భూషణంగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ ఏ రాజు, టీిఆర ్ఎస్మండల అధ్యక్షుడు రమేష్ ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్లు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం డీఎంఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల, పట్టణ ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ నెంబర్లు, బీఆర్ఎస ్నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెబ్బేరులో..
పెబ్బేరు పురపాలక కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదినాన్ని వేడుకలను జరుపుకున్నారు.పట్టణ అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి, రోగు లకు పండ్లు, బ్రెడ్లపంపిణీ చేశారు. అనంతరం హాస్పి టల్ ఆవరణలో మొక్కను నాటారు. సాయి బాబా దేవాలయం వద్ద సీఎం జన్మదినం సందర్భంగా కేసీఆర్ పేరు మీద పూజ లు నిర్వహించారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ శ్రీ సాయినాథ్, వైస్ చైర్మన్ కర్రెస్వామి, కౌన్సి లర్లు ఎల్లారెడ్డి, గోపిబాబు, కో ఆప్షన్ సభ్యులు ముస్తాక్, సంతోష్,భారతి, జయసింహ రెడ్డి, మేకల ఎల్లయ్య , మజీ ద్, కిషోర్, మహేశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి , గోవర్ధన్ రెడ్డి, బస్వ రాజు గౌడ్, బాలక్రిష్ణ, వైద్యాధికారుల బృందం పాల్గొన్నారు.