Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీపనగండ్ల : బైక్ పైనుంచి పడి..వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గోవర్ధ నగిరి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచే సుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలం రాంపురం గ్రామానికి చెందిన ఖాదర్ (32) బైక్ పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి పక్కనే ఉన్న పంట కాలువ గైడ్‌వాల్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. ఖాదర్తన కుమారుడితో కలిసి పెళ్లి పత్రికలు పంచడానికి పెబ్బేరు మండలం అయ్యవారిపల్లికి వెళ్లి తిరిగి రాంపురం బయలుదేరి వెళ్తున్న సమయంలో గోవర్ధనగిరి సమీపంలో బైక్ పై వెనుకాల కూర్చున్న తండ్రి ఖాదర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న కుమారుడి చేతు లకు తీవ్ర గాయాలు గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రదేశంలో అనేకసార్లు కారు, బైక్‌లపై ప్రయా ణిస్తుండగా ప్రమాదశాత్తు కిందపడి కొందరికి గాయాలు కాగా మరికొందరు మృత్యువాత పడిన సంఘటనలు లేకపోలేదని తెలిపారు.ఈ ప్రదేశంలో మూలమలుపు కావడంతో వాహనదారులుపలు ప్రమాదాలకు గురవు తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మూల మలుపును సరిచేయాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికా రులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామస్తుల రాస్తారోకో..
గోవర్ధనగిరి నుంచి వెలగొండ వెళ్లే మధ్యలో మూలమలుపు రహదారిని సరిచేయాలని డిమాండ్ చేస్తూ సంఘటన స్థలంలో గ్రామస్తులు అరగంటసేపు వాహనాలను నిలిపి రాస్తారోకో నిర్వహించారు.