Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తకోట : కొత్తకోట కు చెందిన ఆరోగ్య వాకింగ్ సభ్యులు దాదాపు 50 మంది కోయిలకొండ గట్టును ఆదివారం సందర్శించారు. ఉమ్మడిమహబూబ్ నగర్ జిల్లాలోని చారిత్రత్మక ప్రదేశాలను సందర్శించి ఇక్కడి చరిత్ర, విశేషాలను తెలుసు కోవాలనే ఆకాంక్షతో ఇప్పటికే జిల్లాలోని ఐదు కొండలను సందర్శించినట్లు ఆరోగ్య వాకింగ్ సభ్యుడు శేఖర్ గౌడ్ తెలిపారు. ఇదే కోరికతో సభ్యులు కోయిల కొండను సందర్శించి ఇక్కడి విశేషాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ సభ్యులు నాగేష్ సాగర్, మెగా రెడీ, చిన్న, కృష్ణ, గోపి, జగన్, పాండు, శ్రీను , రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.