Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట బయట నుంచి శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. ఆది మాట్లాడుతూ.. ప్రస్తుతం జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రాక్టికల్ నిర్వహిస్తున్నారన్నారు. విద్యుత్ అధికారులు గురువారం కళాశాలకు వచ్చి విద్యుత్ సౌకర్యాన్ని తొలగించి మీటర్లను తీసివేశారన్నారు. విద్యుత్ సౌకర్యాన్ని తొలగించడం ఏంటని ప్రశ్నించగా ప్రిన్సిపాల్ తొలగించమని దరఖాస్తు పెట్టుకున్నారని అందుకే తొలగి స్తున్నామని అధికారులు సమా ధానం ఇచ్చారని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ చేయాలంటే విద్యుత్ తప్పనిసరి అవసరమని, విద్యుత్లేేకుండా ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు స్పంది ంచి న్యాయం చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించ కపోతే పెద్దఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయ కులు అశోక్, మల్లేష్, కృష్ణ, అజయ్, రఘు పాల్గొన్నారు.
స్పందించిన అధికారులు
ప్రాక్టికల్ చేస్తున్న విద్యార్థులకు ఆటంకం కలిగించకుండా విద్యుత్ సౌకర్యం యధావిధిగా కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేసిన తరుణంలో ప్రిన్సిపల్, విద్యుత్ అధికారులతో మాట్లాడి కళాశాల టైంలోనే విద్యుత్ సదుపాయని కల్పించారని జిల్లా కార్యదర్శి తెలిపారు. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన ప్రిన్సిపాల్‌కు ధన్యవాదాలు తెలిపారు.