Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ - తిమ్మాజీపేట
12 వందల మంది అమరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు ఫలితాలు దక్కాయని మాజీమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎదిరేపల్లిలో గురువారం హత్సేహత్ జోడో యాత్ర కార్యక్రమంలో భాగంగా మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు నాగం శశిధర్ రెడ్డి మండల నాయకులతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి పదేళ్లు కావస్తున్న ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు లక్షల డబుల్ బెడ్ రూములు నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇంతవ రకు ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించిందో చెప్పాలన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసిందని ఆయన గుర్తుచేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయ న్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న సమయంలో భూస్వాముల నుంచి భూములు తీసుకొని పేదలకు పంచి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిం దన్నా రు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు నిర్మిస్తామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డులు, పెన్షన్లు ఇస్తామని ఆయన హామీఇచ్చారు. హత్సే హత్ జోడయాత్రలో నియోజ కవర్గం లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుం టామ న్నారు. నాగం శశిధర్ రెడ్డి, మండల నాయకులు స్థానిక కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు. ఎదిరేపల్లి తాండకు వెళ్లి గిరిజనులతో మాట్లా డారు. యువకులు తాండవాసులు తమకు తాగునీరు లేక ఇబ్బందులు పడుతు న్నామని నాగం దృష్టికి తీసుకోవచ్చారు. స్పందించిన ఆయన సంబంధిత ఆర్డబ్ల్యూ ఎస్ ఈఈ తో ఫోన్లో మాట్లాడారు. నేడు శుక్రవారం బోర్ వేయించి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగం శశిధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అర్థం రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్యగౌడ్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు దానం బాలరాజ్, పీసీసీ సభ్యులు బాలగౌడ్, పాండు, మండల అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, యూత్ జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు నాగసా యిలు, మాధవులు, నరేందర్‌రెడ్డి, సహదేవ్, భీముడు, శ్రీశైలం పాల్గొన్నారు.