Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మకూరు : మండలంలోని రేచింతల గ్రామస్తులు పట్టుదలతో తమ సౌలభ్యం కోసం వాగుపై కాజ్ వే (బ్రిడ్జీ ) నిర్మించారు. మండలంలో చివరగా ఉన్న మారుమూల గ్రామం. జనాభా దాదాపు 1,233, గ్రామానికి ఒకవైపు కృష్ణ నది, మరోవైపు ఊక చెట్టువాగు, గ్రామస్తులు, పట్టణ ప్రాంతాల్లోకి చేరుకోవాలంటే మండలానికి మండల కార్యాలయాలు, బ్యాంకు పనులపై వెళ్లాలంటే 25 కిలోమీటర్లు, పట్టణాలకు వెళ్లాలంటే ఇబ్బంది కరంగా ఉండేది. బస్సు సౌకర్యాలు అంతగా లేవు. ఈ విషయాన్ని గమనించిన మాజీ సర్పంచ్ కీ.శే మురళీధర్‌రావు మొట్టమొదటిసారిగా దాదాపు 20 ఏళ్ల క్రితం తాత్కాలిక గ్రామంలోని గ్రామస్తులతో చందాలు, ప్రజాప్రతినిధులతో చందాలు వేసి నిర్మించి, పక్కనే నేషనల్ హైవే 44నెంబర్‌కు సమీపంలోని పెబ్బేరుకు దగ్గరగా దాదాపు 8 కిలో మీటర్లు. పూర్వం వేసవిలో మాత్రం అవతలికి పెబ్బేరుకు నడిచి వెళ్లేవారు. ఈ పట్టణానికి వెళ్లేం దుకు ఆయన చేసిన కృషి అభినందనీయం. అయితే కొంతకాలం తర్వాత అట్టి బ్రిడ్జీ శిథిలం కావడంతో , గ్రామస్తులు రేచింతల పెబ్బెర్ వెళ్లేందుకు పార్టీ ఊకచెట్టు వాగుపై ఉన్న కాజ్ వే బ్రిడ్జీ దాదాపు 1000 ఫీట్లు ఉన్నది.దీనిని ప్రభుత్వం నుంచి అందిం చే పది లక్షలు, గ్రామస్తులు ఒక్కొక్కరూ కొంత , రూ. 60 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన నిధులతో కాజ్ వే నిర్మించారు. ఇక్కడి గ్రామ స్తులు ప్రతి శనివారం పెబ్బేరులో జరిగే సంతకు వెళ్తుంటారు. జాతీయ రహదారికి వెళ్లినచో కర్నూలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా మారింది. పట్టణాలకు వెళ్లేందుకు ఈ బ్రిడ్జీ ఎంతో ఉపయో గంగా మారిందని గ్రామస్తులు, సర్పంచ్ సరోజ రాఘవేందర్ , ఉప సర్పంచ్, ఎంపీటీసీ అలివేలు బీసన్న, నరసింహ యాదవ్, కుమ్మరి వెంకటన్న, లక్ష్మణరావు, భాస్కర్ తెలిపారు.