Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలంపూర్ : అలంపూర్, పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఎస్పీ కె. సృజన సందర్శించారు. ఈ సందర్భ ంగా పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, స్టేషన్ పరిసరాలను, పలు రికార్డుల ను, వాహనాల పార్కింగ్, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్, లాక్ అప్ రూమ్‌లను పరిశీలి ంచారు. ఆయా కేసు లలో పట్టుబడ్డ వాహనాలను కోర్టు అనుమతి తీసుకొని వాహన యజ మానులకు అప్పగించాలని సూచించారు.స్టేషన్లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరి యర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్‌ను తనిఖీ చేశారు. మహిళ అధికారులకు రెస్ట్ రూమ్ సౌకర్యాలను అడిగి తెలుసు కున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు. వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ సిబ్బందితో మాట్లా డుతూ స్టాఫ్‌కు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్క రించుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ సీఐ సూర్య నాయక్, ఎస్సైలుమహేందర్, బాలరాజు, గోకారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉండవల్లి: మండల పరిధిలో 44వ జాతీయ రహదారి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నదని తెలంగాణ రాష్ట్రం సరిహద్దు ప్రాంతం ఉన్నందున రోడ్డు ప్రమాదాలుజరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సృజన పోలీసు అధికారులకు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి జరిగినరోడ్డు ప్రమాదంలో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బొలెరో వాహనం అతివేగంగా రావడంతో ద్విచక్ర వాహనాన్ని ఢకొీనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందినట్లు సీఐ సూర్యనారాయణ ఎస్పీకి వివరించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రోడ్డు వెంబడి ప్రమాద సంఘటనలు గుర్తిం చి నియంత్రిక సూచిక బోర్డు ఏర్పాటుచేయాలని పోలీస్‌శాఖకు ఆదేశిం చారు.అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. సీజ్వాహనాలను కోర్ట్ఆర్డర్తో అందజేయాలని వారు తెలిపారు. పోలీస్ శాఖ ప్రజల పట్ల ప్రమాదం ఉండాలని. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తీసుకోకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ సూర్య నారాయణ,ఎస్సైబాలరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.