Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జీ. మధుసూధన్‌రెడ్డి
కొత్తకోట : అమడబాకుల పులిగుట్టలో జరుగుతున్న మైనింగ్ పనులను ఆపాలని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం అమడబాకుల గ్రామ సమీపంలోని పులిగుతరతరతరతరతరతట్ట వద్ద జరుగుతున్న క్వాడ్జ్ మైనింగ్ పనులను గ్రామస్తులతో కలిసి జీఎంఆర్ పరిశీలించారు. మైనింగ్ పనుల వల్ల స్థానిక రెసిడెన్షియల్ స్కూల్ కు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు జీఎంఆర్ వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్ పనుల వల్ల పులిగుట్ట ప్రాంత ంలో దాదాపు 500 పైగా నెమ్మళ్లు కనిపించకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో మైనింగ్ కు అనుమతులు తీసుకొని అప్పుడు పనులు మొదలు పెట్టడంతో ఆనాడే గ్రామస్తులు అడ్డుకో వడంతో మైనింగ్ పనులు నిలిచిపోయాయని అ న్నారు. తిరిగి కాంట్రాక్టర్ ఇన్ని సంవత్సరాలకు తప్పు డు పత్రాలతో స్థానికంగా కొంతమంది అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సహాయంతో ఇప్పుడు లైసెన్స్ రెన్యూ వల్ చేసుకుని మైనింగ్ చేపట్టారని పేర్కొన్నారు. క్వాడ్జ్ మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఎనుగుంట రిజర్వాయర్, మోడల్ స్కూల్ ఉన్నాయని తెలిపారు. మైనింగ్ పనుల కారణంగా పర్యావరణ సమతుల్యంలోపించే అవకాశం ఉందని ఆరోపి ంచారు. ఏనుగు గుట్ట గుట్ట రిజర్వాయర్‌కు పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏనుగు గుంట రిజర్వాయర్ ప్రమాదం జరిగితే 5వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థక మవుతుందని వాపోయారు. దీంతో 500మంది మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి కరువు అవుతుందని అన్నారు. తక్షణమే మైనింగ్ పనుల ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అనుమతులపై చట్టరీత్య కోర్టుల ద్వారా మైనింగ్ పనులు ఆపే వరకు కృషి చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో అమడబాకుల గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.