Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా
తుంటరి నడకా
తెలిసి అడుగేసినావే మాయంటీ 'బుల్లితెర' వెనుకా,
ఆనందం అంగడి సరుకా
కొనగలవా చెయ్యి జారక,
సమయం ఎంత మిగిలిందమ్మా,
'ఛానల్స్' అన్నీ చూసేసాక!
కోరస్ : మొగుడింక చిలకా లేడింక...
చరణం-1 : చుట్టాల్ని తరిమేసి...
చిన్నతెరను ప్రేమించావే!
పెనిమిటిని వెలివేసి ఊహల్లో జీవించావే!
పొదుపంతా కరిగించి ఆ విలువతో
పెద్ద టీవీ కొన్నావే అతితెలివితో,
కురిసే డైలీ సీరియల్స్ జడిలో,
తడిసి తలనొప్పయ్యావే !
చరణం-2 : సమయాన్ని కొనగలిగే ధనముందా
ఈ లోకంలో ?
చదువు విలువెంతో మరిచావా
'స్టార్ మహిళ' మైకంలో,
వినోదం ఇవ్వలేని ఆ టీవితో,
అనాధగా మిగిలావే ఆగదిలో,
కోరస్ : జనం అండ నీకు లేదింక...
తీరా నువ్వు వెనక్కి తిరిగాక
ఇల్లంతా ఖాళి ఇంకా !
- వీరేశ్వర రావు మూల
veeru16@gmail.com