Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిగి అడిగి విరిగిపోవడం తెలిసినవాడికి
నదిలో కరిగిపోయి జీవించడమూ ఎరుక
పత్రహరిత చైతన్యమై నిలబడ్డ
గొంతొకటి వేళ్ళ తీగల్ని మీటుతూ
దశాబ్దాలుగా అరణ్యమై నినదిస్తున్నది
బక్కపల్చని భరోసా
చీకటి తెరమీద ఆశలు అలుకుతున్న అలికిడి
నిరాయుధ యోధత్వం కూడా ఒక వెలుతురైన చోట
కనురెప్పల్లాంటి ఆకుల గలగలలు కూడా
స్వేచ్ఛను పులుముకున్నట్టే
గుండెను దీపంలా వెలిగించి
కొండల్ని వెలుతురుమయం చేయడం
అతడికే సాధ్యమయ్యింది
జైల్లో అలిసిన పాదం
ముడుచుకున్న వానపాములా మెసులుతున్నా
ఊపిరిమాత్రం ఏ సెలయేటి ఒడ్డున
రేల పాట పాడుతున్న
ఆదివాసీలతో శ్రుతి కలుపుతున్నది
మనసు, మస్తిష్కం రెండు కళ్ళయి
అపనమ్మకాన్ని చదునుచేస్తున్నవి
యవ్వనపు తాళ్ళు తెంపుకున్న ముసలి జింకపిల్ల
చూపులకు సంకెళ్ల విషాదం
పార్కికిన్సన్తో దేశమే వణుకుతున్న సందర్భం
బెయిల్ అంటే ఇప్పుడు
శవం మీద కప్పే తెల్లబట్ట మాత్రమే
(స్టాన్ స్వామి స్మతిలో)
- వేముగంటి మురళి
సెల్: 9676598465