Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని వణికిస్తున్న కరాళ విహంగం -
మనిషి ప్రాణాలను హరిస్తున్న మత్యు మదంగం -
మానవ సంబంధాల బాంధవ్యాలను
చెరిపేస్తున్న మహా అగాధం -
అవును....
మహమ్మారి విహారంలో
ఆప్యాయతలు అడుగంటుతున్నాయి
అనురాగాలు కొడిగడుతున్నాయి
బంధాలు - అనుబంధాలు
నిర్దాక్షణ్యంగా ఛిద్రం అవుతున్నాయి...!
జీవన గమనంలో
స్నేహాల మధ్య దూరాలు పెంచి
బందువుల మధ్యఅడ్డుగోడలు నిర్మించి
మరణశయ్య మీద మన వాళ్ళు
ఆఖరి మజిలిలో ఆయాసపడ్తున్నప్పుడు
అక్కున చేర్చుకోలేని దుస్థితి
శాపంగా పరిణమిస్తున్న
ఓ కరోనా వైరసి
విలయ తాండవం ఆపు
ఈ ప్రపంచం అలసిపోయింది
నీ విలాసం ఇక చాలు!
కుటుంబ సభ్యులు
ప్రాణ స్నేహితులు
శ్రేయోభిలాషులు
ఆప్తులు అల్లాడిపోతున్న దశ్యాలు
ఒకవైపు....
మరణం తర్వాత చివరి చూపుకు నోచుకోని
నిస్సహాయ పరిస్థితులు
మరొక వైపు...
ఓ విపరీత వ్యదా ఇక వెళ్ళిపో!
అంతిమ సంస్కారం కరువయ్యే
మత్యువు ఎంత పాపం
ఎన్ని జన్మల దుఃఖం
ఓ కరోనా
కాలాన్ని శాసిస్తూ
విధి విలపమై వీధుల్లో సంచరిస్తూ
శ్వాసల్ని సమాధి చేయడం ఇంకెంత కాలం?
నిన్ను మానవ మేధస్సు తరిమికొట్టే
రోజులు దగ్గరపడుతున్నాయి తెలుసుకో!
కరోనా....
నిన్ను జయించి
నీ నుండి నుంచి కోలుకున్న తరువాత సైతం
భయమై వెంటాడుతున్నావు -
సొంతవారే దూరం పెట్టి
ఇంటికి తీసుకెళ్లకుండా వెళ్లిపోతున్న వైనమై
సంచరిస్తున్నావు -
అయ్యో
మానవత్వం సమూలంగా
తుడిచివెయ్యబడుతుంటే
సమాజంలో శోకం రచించబడుతున్నది
నేటి జిగి బిగి జీవితాల్లో
బలహీనమైన మానవ బంధాలు
మంటగలిసిపోతున్నాయి.....
ఓ కరోనా నీ పుణ్యమా అని
అంటరానితనం రూపుమార్చుకుని మళ్ళీ
సవాళ్లు విసురుతున్నట్లున్నది
ఈ విష సందర్భాలు
కరోనా మతుల కుటుంబసభ్యులను
నేరస్తుల్లా చూస్తుంటే
సంస్కారం తలదించుకుంటున్నది...
అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం..
ఆత్మ తప్తికై మనుషులు ఆడుతున్న వింత నాటకం'
అన్న సినారె పదాలు అక్షర సత్యాలని
నేడు రూఢ అవుతుంది....
ఎవరు తల్లి?
ఎవరు కొడుకు?
ఎవరు తోబుట్టువు?
ఇదంతా అంతుచిక్కని నిర్వాకం
చిక్కబడుతున్న నిర్వేదం
అంతా నిర్వీర్యం
ఇది కరోనా నిర్ణయం
కావాలి ఇప్పుడు మనో నిబ్బరం!!!
- పొన్నం రవిచంద్ర
9440077499