Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి :
అతడు : వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
మా సందు చివరలోనా ఈ షాపు తెరిచినపుడు
నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
ఆమె : వద్దు వద్దు తాగ వద్దు తాగితే వొళ్ళు గుల్లా,
దాంతో జేబుకు చిల్లోరు
తూలే తూలే తూలే తూలే సోలే సోలే సోలే సోలే
తూలే తూలే తూలే తూలే సోలే సోలే సోలే సోలే
చరణం :
అతడు : ఆ.... నీ చేతికి గాజులు నేనే కదా
ఇక గాజులతో పని లేదే కదా
నీ చేతిలో గాజులు బంగారమే
అవి అమ్మితే మందుకిక బేఫికరే
ఆమె : ఆ గాజులు మా అవ్వోళ్ళు పెట్టిండ్రులే,
ఆటి జోలికి వస్తే యీపు ఇమానమే
అతడు : ఇది గల్లడబ్బా, లేక పోపుడబ్బా
ఆమె : ఆ చిల్లరకై చిల్లరేషాలా
అతడు : అహ నిన్నటిదాక నేనొక హాఫుని
నువ్వొచ్చాక ఫుల్ బాటలునైతిని
(వైను అనే షాపు కాడా)
చరణం :
ఆమె : నువ్ తాగితే దొరకదు సుఖం సుఖం
ఆ సుఖముకు ఫలితం దు:ఖం దు:ఖం
అతడు : మంచిమందు దొరికెతే స్వర్గం స్వర్గం
ఆనందమే ఇక నేనేమయిపోయినా
ఆమె : సోయి ఉండదులే ఈ మందు మైకానా
అతడు : కుతి తీరదులే ఎంత తాగుతున్నా
ఆమె : ఇది జన్మ జన్మలకు వదలని తాశిలి
ఇగురాన్నిది చెడిపే బాపతి
(వైను అనే షాపు కాడా)
'ప్రేమికులరోజు' (1999) చిత్రంలోని
'ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్ధిని'
పాటకు పేరడీ.
రచన : ఏ.ఎం.రత్నం,శివగణేశ్
- డా. బి. బాలకష్ణ
9948997983