Authorization
Fri April 04, 2025 11:54:10 pm
పల్లవి : హే ఈగవి నువ్వు దోమని నేను
ఇద్దరమొకటవనీ
బారులు తీరే రోగులకేమో నిద్దర కరువవనీ
(ఈగవి)
కొత్తరోగం ఫ్లైటెక్కిరాని
ఉన్నరోగం ఉడుకెత్తిపోని
కొత్తరోగం ఫ్లైటెక్కిరాని
ఉన్నరోగం ఉడుకెత్తిపోని
మధ్య వైద్యమే ముసుగేసుకోని (ఈగవి)
చరణం : ఒకటి ఒకటి రెండు
రెండు న్నొకటి మూడు
థర్డ్ వేవు వేళ ఇది
బ్లాకు బ్లాకు ఫంగస్
పొంచి పొంచి వచ్చెరు
మాస్కులు లేని లోకమిది
హౌరు... ఆసు పత్రిలో ఆక్సిజన్ గోల
కార్పొ రేటుకు కనికర మేల
ముందరుందోరు ముప్పుల మేళా
ముంచుకొచ్చే తిప్పలతెప్పా
మెడికల్ షాపుకే పండుగపోరా (ఈగవి)
చరణం : డెంగ్యూ తలుపే తడితే
మెదడు వాపే పుడితే
ఊపిరితిరుగక పడిపోరా
రోజు విడిచి రోజు
జ్వరమే వచ్చి వెళితే
వణికి వణికి సచ్చిపోరా
చికెను గున్యా చికెనుకు రాదు
కాలాజ్వరము తెల్లారే పోదు
తప్పకుంటే బీమారి భోగం
మందులోనికి బంగారుయోగం
మాయా లోకం మజ్జారే రోగం (ఈగవి)
పెదరాయుడుః (1995) చిత్రంలోని
బావవి నువ్వు భామను నేనుః పాటకు పేరడి.
రచన : భువనచంద్ర.
- డా.బి.బాలకష్ణ
9948997983