Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : ఎక్కడ వున్నా ఏమైనా
మనమెవరికి వారై వేరైనా
నీ అప్పే నే ను ఎగ్గొడుతున్నా
.. నిను వీడి అందుకే వెళుతున్నా
నీ అప్పేనే ఎగ్గొడుతున్నా ...
చరణం 1 : ఇచ్చావని తిరిగిరావు అన్నీ
అడగక పోయినా ఆగవు కొన్నీ
వచ్చేవన్నీ నీ వని
అనుకోవడమే నీ పని
నీ అప్పే నే ఎగ్గొడుతున్నా
..నిను వీడి అందుకే వెళుతున్నా
చరణం 2 : ప్రామిసరీ నోటే రాసేసినాను
బ్యాంకులే ఉన్నాయని కోతలు కోసాను
వడ్డీలే గుడ్డిగా పెంచాను .....
వడ్డీలే గుడ్డిగా పెంచాను
నువ్వు అడుగుతావని జారుకున్నాను.
నీ అప్పే నేను ఎగ్గొడుతున్నా
..నిను వీడి అందుకే వెళుతున్నా
అప్పులు చేసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
అప్పిచ్చినదే నిజమైతే...
మాఫీ యే రుజువు కదా
నీ అప్పే నే ఎగ్గొడుతున్నా
..నిను వీడి అందుకే వెళుతున్నా
చరణం 3 : నీ డబ్బులు బాగా పెరగనీ
... నా అప్పే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలనీ.
దీవిస్తున్నా నా ఫ్రెండుని
.. దీవిస్తున్నా నా ఫ్రెండుని
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ అప్పే నే ఎగ్గొడుతున్నా
..నిను వీడి అందుకే వెళుతున్నా
- వీరేశ్వర రావు మూల
veeru16@gmail.com