Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెబ్వర్క్స్, ఐరన్ మౌంటైన్ జెవి వెల్లడి
హైదరాబాద్: వెబ్వర్క్స్, ఐరన్ మౌంటైన్ డేటా సెంటర్స్ సంయుక్తంగా దేశంలో తమ మొదటి డేటా సెంటర్-1ని హైదరాబాద్లో ఏర్పాటుచేసినట్టు ప్రకటించాయి. నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న హెచ్వైడి-1 సెంటర్ను 1.20 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించాయి. దేశం అంతటా 'స్ట్రింగ్ ఆఫ్ డిజిటల్ పెరల్స్'ని రూపొందించడానికి భారీ పెట్టుబడులను చేపట్టినట్టు తెలిపాయి. ఇది గ్లోబల్ డేటా సెంటర్ ప్రొవైడర్తో క్లిష్టమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా కస్టమర్లు వారి డిజిటల్ పరివర్తన వ్యూహాలను విస్తరించటానికి వీలు కల్పిస్తుందని వెబ్వర్క్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ నిఖిల్ రాఠీ పేర్కొన్నారు.