Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రయివేటు టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐ) గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. క్రమంగా ఖాతాదారులు చేజారిపోతు న్నారు. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో 20 లక్షల మంది వీఐని వీడారని ట్రారు ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. జియోలోకి 10 లక్షల మంది చేరగా, ఎయిర్‌టెల్‌లోకి 9,82,554 మంది చేరారు. దేశంలో మొత్తం వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 10లక్షల మేరకు తగ్గారు. జియోకు 37.41 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌కు 32.29 శాతం, విఐకి 20 శాతం, బీఎస్ఎన్ఎల్కు 9.37 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి. జియో, ఎయిర్టెల్ 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తుండగా.. విఐ మాత్రం ఇందులో వెనుకబడి పోవడంతో ఆ సంస్థను ఖాతాదారులు వీడుతున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.