Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్ట్‌లైఫ్ ఫుడ్ వరల్డ్ వెల్లడి
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 18 కొత్త రెస్టారెంట్లు తెరిచామని వెస్ట్‌లైఫ్ ఫుడ్ వరల్డ్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ సంస్థ మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 40-45 రెస్టారెంట్లను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. 2027 నాటికి 580-630 కొత్త అవుట్లెట్లను ప్రారంభించాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. 2023 మార్చి ముగింపు నాటికి 56 నగరాల్లో 357 రెస్టారెంట్లను కలిగి ఉంది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికం అమ్మకాల్లో 14 శాతం వృద్థితో రూ.556 కోట్ల అమ్మకాలు నమోదు చేసినట్టు తెలిపింది.