Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ జంట నగరాల్లో మరో రెండు కొత్త శాఖలను తెరిచింది. చందానగర్, యాప్రాల్లో ఏర్పాటు చేసిన నూతన శాఖలను ఆ బ్యాంక్ ఫీల్డ్ జోనల్ మేనేజర్ గనేశరామన్ ఎ లాంచనంగా ప్రారంభించారు. వీటితో తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ బ్యాంక్ శాఖలు 162కి చేరగా.. దేశ వ్యాప్తంగా 5814 శాఖలకు విస్తరించినట్లయ్యింది. నూతన శాఖల ప్రారంభోత్సవంలో జోనల్ మేనేజర్ చంద్ర ప్రకాశ్ సహా ఇతర అధికారులు, ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు.