Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందు కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తున్న టాస్క్‌తో కలిసి పని చేయనున్నట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తెలిపింది. కొత్త గ్రాడ్యూ యేట్లకు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందంపై హైదరాబాద్‌లో టాస్క్ సిఇఒ శ్రీకాంత్ సిన్హా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాలెంట్ అక్విజిషన్ హెడ్ రంగ సుబ్రమణి యన్ సంతకాలు చేశారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులకు టాస్క్ సహాయాన్ని అందిస్తుంది. ప్లేస్మెంట్ డ్రైవ్‌లు, ఇంటర్వ్యూలకు అన్ని రకాల లాజిస్టికల్ మద్దతును టాస్క్ కల్పిస్తుంది.