Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఓలా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ తన నెట్‌వర్క్‌ను 500 ఎక్స్పీరియన్స్ సెంటర్లకు విస్తరించింది. శ్రీనగర్‌లో నూ తన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరింది. హైదరాబాద్‌లోనూ గత కొన్ని వారాల్లో తన నెట్‌వర్క్‌ను మూడింతలు పెంచి.. తొమ్మిది ఎక్స్పీరియన్స్ సెంటర్లకు చేర్చినట్టు వెల్లడిం చింది. దేశవ్యాప్త డీ2సీ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను గత కొన్ని వారాలుగా చురుకుగా ప్రారంభించుకుంటూ వస్తు న్నట్టు తెలిపింది. గత సంవత్సరం పూణేలో తన మొట్టమొదటి అవుట్ లెట్‌ను ప్రారంభించి నప్పటి నుండి కేవలం ఎనిమిది నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరి శ్రమలో అతిపెద్ద బి2సి రిటైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం దాదాపు 300 నగరాల్లో ఓలా తన ఉనికిని కలిగివుందని తెలి పింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో ఈ సంఖ్యను 1,000కి చేర్చా లని నిర్దేశించుకున్నామని ఓలా ఎలక్ట్రిక్ సీఎంఓ అన్షుల్ ఖండేల్వల్ పేర్కొ న్నారు. ఈ 500వ స్టోర్ ప్రారంభించడం తమ విజయాన్నీ సూచించడం తో పాటు ఇంకా ముందున్న సవాళ్లను కూడా గుర్తు చేస్తుందన్నారు.