Authorization
Wed April 02, 2025 03:52:12 pm
హైదరాబాద్ : ప్రముఖ బంగారు, వజ్రాభరణాల రిటైల్ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ హైదరాబాద్‌లో 12 స్టోర్లకు విస్తరించింది. కూకట్ పల్లిలో శనివారం తన రెండవ స్టోర్‌ను తెరిచింది. దీన్ని ఎంఎల్ఎ అరికపూడి గాంధీ, మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స యండీ ఇండియా ఆపరేషన్స్ అషర్ ఓ, రిటైల్ హెడ్ సిరాజ్ పికె లాంచనంగా ప్రారంభించారు. ఈ నూతన స్టోర్‌ను 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ నుంచి వచ్చిన లాభాల్లో 5 శాతాన్ని ఆ ప్రాంతంలోని వివిధ స్వచ్ఛంద కార్యకలాపాల కోసం కేటాయించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.