Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వం లాఠీచార్జీ చేసినా, వాటర్క్యాన్లు, టియర్ గ్యాస్‌లు ప్రయోగించినా రైతులు
శాంతియుతంగానే తమ పోరాటాన్ని కొనసాగించారు. తమపై లాఠీచార్జి, టియర్‌గ్యాస్, నీటి
ఫిరంగులు ప్రయోగించిన పోలీసులను పిలిచి మోడీ ప్రభుత్వం మీకు లాఠీలు, నీటి ఫిరంగులు,
టియర్ గ్యాస్ ఇచ్చి పంపింది. కానీ మీరు ఆలసి పోయారు. రండి కూర్చొని భోజనం చేయండి అని తమపై నిర్భందం ప్రయోగించిన పోలీసులకే అన్నం పెట్టి తమ విజ్ఞతను చాటారు అన్నదాతలు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పోరేట్ అనుకూల, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా భారత రైతాంగం సుదీర్ఘకాలం పోరాటం చేసి చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ సంవత్సర కాలంలో అనేక త్యాగాలు, బలి దానాలు చేశారు. బడా కార్పోరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నించింది. దీన్ని వెనక్కి కొట్టేందుకు చేసిన పోరాటం నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో విజయాన్ని సాధించింది. కార్పోరేట్లకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు ఒక విశ్వాసాన్ని కలిగించాయి. సంయుక్త కిసాన్ మోర్చా మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణను స్వాగతించింది. పార్లమెంట్లో ఉపసంహరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. వీటితోపాటు దేశంలోని రైతు సంఘాలు కోరిన విధంగా గతంలో నరేంధ్ర మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50 శాతం (సి2+50 శాతం) కలిపి మద్దతు ధర గ్యారెంటీ చేసే చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, రైతు ఉద్యమంలో మరణించిన 700కు పైగా కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబాలకు శాశ్వత ఉపాధి కల్పించాలని, ఉత్తర ప్రదేశ్‌లోని లక్కింపూర్ కేరీలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణానికి కారణమైన హౌంశాఖ సహాయ మంత్రి అజరు కుమార్ మిశ్రాను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని, అదే విధంగా అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఉద్యమ కాలంలో రైతులపై పెట్టిన ఆక్రమ కేసులను ఎత్తి వేయాలని, రైతు ఉద్యమానికి సహకరించిన వారిపై పెట్టిన కేసుల ఎత్తి వేయాలని కోరింది. ఈ డిమాండ్ల సాధనకు సమరశీలమైన పోరాటాలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు నిచ్చింది.
ఉద్యమ ప్రారంభ నేపథ్యం
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టేందుకు జూన్ 05, 2020లో 3 ఆర్డినెన్స్‌లను తీసుకు వచ్చింది. 1. స్వేచ్ఛా మార్కెట్ చట్టం, 2. కాంట్రాక్టు ఒప్పంద చట్టం, 3. నిత్యావసర వస్తువుల నియంత్రణ సవరణ చట్టం.
పై మూడు చట్టాలకు వ్యతిరేకంగా జూన్ 10వ తేదీ నుంచి అఖిల భారత కిసాన్ సభ (ఏఐకెఎస్) ఆర్డినెన్స్ కాపీల దగ్దానికి పిలుపు నిచ్చింది. కరోనా విజృంభిస్తున్న కాలంలో ప్రజలు బయటకు రాని సమయంలో పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని ఖూని చేస్తు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తీసుకు వచ్చింది. అయినప్పటికీ కిసాన్ సభ కార్యకర్తలు దేశవ్యాప్తంగా వేలాది కేంద్రాల్లో ఆర్డినెన్స్ కాపీలను దగ్దం చేశారు. దశల వారీగా ఆందోళన పోరాట కార్యక్రమాలు కొనసాగాయి. ఈ క్రమంలోనే గతం నుంచి కనీస మద్దతు ధరల చట్టం, రైతుల ఆత్మహత్యల నివారణకు కేరళ తరహా రుణ విమోచన చట్టం కావాలని ఆందోళన నిర్వహిస్తున్న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. ఉత్తర భారత్‌లోని పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా పోరాటం ఉధృతంగా ప్రారంభమైంది. 2020 నవంబర్ 26న ఢిల్లీలోని రాంలీల మైదానానికి లక్షలాది మంది తరలి వచ్చేందుకు బయలు దేరారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఢిల్లీలోకి రాకుండా అడ్డుకున్నది. ఎక్కడైతే రైతులను ఢిల్లీ సరిహద్దులో అపారో అక్కడే రైతాంగం శాంతియుతంగా ఆందోళనలు ప్రారంభిం చారు. ఫలితంగా 1.టిక్రి బార్డర్, 2.పల్వల్ బార్డర్, 3.సింగు బార్డర్, 4. షాజహాన్‌పూర్, 5. ఘాజీపూర్ బార్డర్లలో నిరవధిక ఆదోళనను ప్రారంభించారు. తీవ్రమైన చలిలో శరీరం గడ్డకడుతున్నా కదలకుండా ఢిల్లీ సరిహద్దులో ఆందోళ నలు కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం లాఠీచార్జీ చేసినా, వాటర్ క్యాన్లు, టియర్‌గ్యాస్‌లు ప్రయోగించినా రైతులు శాంతియుతంగానే తమ పోరాటాన్ని కొనసాగించారు. తమపై లాఠీచార్జి, టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించిన పోలీసులను పిలిచి మోడీ ప్రభుత్వం మీకు లాఠీలు, నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ఇచ్చి పంపింది. కానీ మీరు ఆలసి పోయారు. రండి కూర్చొని భోజనం చేయండి అని తమపై నిర్భందం ప్రయోగించిన పోలీసులకే అన్నం పెట్టి తమ విజ్ఞతను చాటారు అన్నదాతలు. ఈ ఉద్యమంపై అనేక రకాల దుష్ప్రచారాలు కేంద్రం ప్రభుత్వం తమ సపరివారం చేశాయి. ఖలిస్థాన్ తీవ్ర వాదులని, చైనా ఏజెంట్లు అని, పాకిస్తాన్ ఏజెంట్లు అని అనేక రకాల దుష్ప్రచారాలు చేశారు. చివరకు 26 జనవరిన కేంద్ర పాలకులే ఒక బృందాన్ని ఎర్రకోట దగ్గరికి దొడ్డి దారీలో ఒక బృందాన్ని అనుమతించి జాతీయ జెండాకు సమాంతరంగా జెండాను ఎగరవేయించారు. సంయుక్త కిసాన్ మోర్చా తమకు అనుమతించిన వరకే ట్రాక్టర్ల ర్యాలీని తీసుకెళ్లి వెనుదిరిగారు. దొడ్డిదారీలో వెళ్ళిన వారు జెండా ఎగరవేయడంతో దాన్ని సాకుగా చూపి ఉద్యమాన్ని ఆణచాలని కేంద్ర ప్రభుత్వం చూసింది. కానీ రైతాంగం రైతు సంఘాల నాయకత్వం శాంతియుతంగా వ్యవహరించారు. కేంద్ర పాలకుల యొక్క కుట్రలను బయట పెట్టారు. కేంద్ర పాలకుల యొక్క వైఖరి దేశవ్యాప్తంగా తేటతెల్లమైంది.
తమ డిమాండ్ల సాధనకు రైతాంగం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో నిరవధిక రైల్ రోకోలు, రాస్తారోకోలు నిర్వహిం చాయి. డిసెంబర్ 8న భారత్‌బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. 210 సంఘాలతో ప్రారంభమై ఉద్యమం 520 సంఘాలకు చేరాయి. రైతు సంఘాలతో పాటు దేశంలోని జాతీయ కార్మిక సంఘాలన్ని ఏకతాటిపైకి వచ్చి రైతు ఉద్యమానికి అండగా నిలబడ్డాయి. తమ డిమాండ్లను కూడ చేర్చి భారత్ బంద్‌తో సహా అన్ని రకాల పోరాటాల్లో భాగస్వాములైనారు. వీరితోపాటు వ్యవసాయ కూలీలు, విద్యార్థి, యువజన, మహిళ, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, మేధావి వర్గాలు ప్రత్యక్షంగా భాగస్వాములైనారు.
ఈ ఆందోళనపై సుప్రీం కోర్టులో కేసు వేయగా సుప్రీం కోర్టు నలుగురితో కమిటీని నిర్ణయించింది. అలాగే చట్టాలు అమలు కాకుండా స్టే విధించింది. కమిటీలోని వారు 1. అశోక్‌గులాటీ, 2. ప్రమోద్‌కుమార్ జోషి, 3. అనిల్ గన్పట్, 4. భూపేంద్రసింగ్ మన్న(ఇతను రెండు రోజుల తరువాత కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు) ఈ కమిటీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే ఉండిపోయింది. ప్రతిరోజు లక్షల మంది వస్తుండడాన్ని గమనించి ప్రభుత్వం ఉద్యమాన్ని విరమింప చేయడానికి 11 సార్లు రైతు ప్రతినిధులతో చర్చలు జరిపారు. కేవలం పంజాబ్, హర్యానాలకు సంబంధించిన రైతు సంఘాలు మాత్రమే చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు ఆ సంఘాలు అత్యంత చైతన్యంతో వ్యవహరించాయి. కేంద్ర సంఘాల నాయకత్వాన్ని కూడ చర్చలకు పిలవాలని కోరాయి. కేంద్ర సంఘాల నుంచి ఇద్దరు మాత్రమే రావాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించిది. అప్పుడు కేంద్ర సంఘాల నుండి ఏఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పని చేసిన హన్నన్ మొల్లను, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌ను కేంద్ర సంఘాల నుంచి చర్చలకు వెళ్ళేందుకు ఏఐకెఎస్‌సిసి నిర్ణయిం చింది. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా 9 అంశాలను రైతు సంఘాల ముందు ఉంచింది. అప్పుడే రైతాంగ ఉద్యమం ఒక అడుగు ముందుకు వేసింది. మరింత పట్టుదలతో పోరాడేందుకు నిర్ణయం తీసుకొని చివరికంట పోరాటాన్ని కొనసాగిస్తున్నది.
అంతర్జాతీయ మద్దతు
నిరవధికంగా సాగుతున్న ఈ పోరాటానికి అంతర్జాతీయంగా గుర్తిం పు వచ్చింది. అనేక దేశాలు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నల్ల చట్టాలను ఎత్తివేయమని సలహాలు ఇచ్చారు. 1. అస్ట్రేలియా పార్లమెంటు, 2. కెనడా పార్లమెంటు సభ్యులు, 3. న్యూజిలాండ్, 4. పాకిస్తాన్, 5. ఇంగ్లాండ్, 6. అమెరికా,7. ఇటలీ అనేక దేశాల గురుద్వారాలు, ఐక్యరాజ్య సమితి, ఐఎంఎఫ్, హ్యూమన్ రైట్స్వాచ్ నిరసనలు తెలిపాయి.
పోరాటంలో అమరులు
- కాలంలో మొత్తం 680 మంది రైతులు మరణించారు. మేధావి వర్గం 5గురు, సంతులు, బికెయుకి చెందిన జోగిందర్‌సింగ్ జువాండ, అమర్జిత్సింగ్రారు అడ్వకేట్, కాశ్మీర్‌సింగ్, అమరేందర్‌సింగ్, రామ్‌సింగ్‌లు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
తెలంగాణలో పోరాటం
జూన్ 20వ తేదీ నుండి రాష్ట్రంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏఐకెఎస్‌సిసి, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడ ప్రత్యక్షంగా 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగ పోరాటంలో భాగస్వాములైనారు. ఆర్డినెన్స్ కాపీల దగ్దం నుండి మొదలుకొని క్విట్ ఇండియా డే సందర్భంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇందిరాపార్కు దగ్గర నెల రోజుల పాటు నిరవధిక ధర్నాలు జరిగాయి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా సరూర్ నగర్ స్టేడియం నుండి ఉప్పల్ వరకు వేలాది వాహనాలతో ర్యాలీ జరిగింది. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుజాత జరిగింది. లక్షలాది కరపత్రాలు, వేలాది బుక్లెట్స్, పోస్టర్లతో విస్తృత ప్రచారం జరిగింది. వందలాది సభలు, సెమినార్లు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. భారత్ బంద్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. డిసెంబర్ 8న జరిగిన భారత్ బంద్ కార్యక్రమాంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కూడ భాగస్వామి అయ్యింది. వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా పోరాటంలో భాగస్వాములైనారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, రాజ్గురుల జయం తుల సందర్భంగా, వర్ధంతుల సందర్భంగా ఆందోళనలు సాగాయి.
మూడు చట్టాల ఉపసంహరణ
19 నవంబర్ 2021న సరిగ్గా సంవత్సరానికి మరో 6 రోజులు ఉందనగా గురునానక్ జయంత్రిని పురస్కరించుకొని ప్రధాని మోడి చట్టాల ఉప సంహరణను ప్రకటించారు. ఈ నెలాఖరులో రానున్న పార్లమెంటు సమావేశాలలో ఉపసంహరణ చట్టం తెస్తానన్నారు. కానీ ఉద్యమ కాలంలో జరిగిన నష్టాల గురించిగాని, డిమాండ్ల గురించిగాని ఏమీ చెప్పలేదు.
8 పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును ఉపసంహరించాలి.
8 రైతు సంఘాలు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కనీస మద్దతు ధరల చట్టాన్ని, రుణ విమో చన చట్టాలుగా రూపొందించాలి
8 పోరాటంలో చనిపోయిన 680 మందికి పరిహారం చెల్లించాలి,
840 వేల మందిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
8 లాఠీచార్జీలో గాయాలపాలైన వారికి సహాయం చేయాలి.
8 తిరిగి ఇవే చట్టాలను మరో రూపంలో తేవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకూడదు.
8 కార్పోరేట్ సంస్థలను వ్యవసాయ రంగంతో సంబంధం లేకుండా చూడాలి.
8 చట్టబద్దంగా చట్టాల విరమణ జరిగిన తరువాత పోరాటాన్ని విరమించడం జరుగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. అంత వరకు గతంలో నిర్ణయించిన పోరాటాలు కొనసాగుతాయి.
- టి. సాగర్, 9490098055
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం