Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలం చెల్లిన మంచినీటి ట్యాంకు
- కూలేందుకు సిద్ధంగా ఉన్న వైనం
నవతెలంగాణ - బాలానగర్
మండలంలోని ఉడిత్యాల గ్రామంలోని హరిజన వాడలోని ప్రాథమికోన్నత పాఠశాల పక్కన నిర్మించిన మంచినీటి ట్యాంకు ప్రమాద కరంగా మారింది. ఆరు దశాబ్ధాల క్రితం ట్యాంకు నిర్మించడంతో కాలం చెల్లి కూలేందుకు సిద్ధంగా ఉంది. అప్పటి జిల్లా కలెక్టర్ ఉషారాణి ట్యాంకును కూల్చేయాలని అప్పటి గ్రామ సర్పంచ్‌కు ఆదేశాలిచ్చింది. కానీ నేటికీ ట్యాంకును కూల్చివేయకపోవడంతో కాలనీ వాసులు భయాందో ళనల మధ్య కాలం గడుపుతున్నారు. ట్యాంకు పక్కనే పాఠశాల ఉంది. అయితే పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. లేకుం టే ఎప్పుడు కూలుతుందోననే భయంతో కాలనీ వాసు లు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఐదేం డ్ల నుంచి ఈ ట్యాంకుకు నీటి సరఫరా నిలిపేశారు. గ్రామంలో 2 మిషన్ భగీరథ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రజలకు తాగు నీరు అందిస్తున్నారు. నీటి సమ స్య లేకపోయినా ట్యాంకు చుట్టూ నివాస గృహాలు న్నందు వల్ల ట్యాంకును ఎలా కూల్చాలో అర్థం కావడ ంలేదని గ్రామ సర్పంచ్ మల్లేష్ యాదవ్ తెలిపారు. ఏదేమైనా వీలైనంత త్వరగా ట్యాంకును కూల్చేసి భయాందోళన నుంచి గట్టెంకించాలని కాలనీవాసులు కోరుతున్నారు.